ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారులు నీరాజ్‌కుమార్ టిబ్రెవల్, నవీన్‌రెడ్డి మంత్రిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి మొక్కలను అందజేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఐఎఫ్‌ఎస్‌లను నియమించారని, అధికారులు అడవుల సంరక్షణను మరింత పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో నిర్మల్ డీఎఫ్‌వో సుతన్, ఎఫ్‌ఆర్వో జైపాల్‌రెడ్డి ఉన్నారు.
