ఈనెల 17 నుంచి భద్రా‌ద్రిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రిం‌చు‌కుని భద్రా‌చల శ్రీ సీతా‌రామ చంద్ర‌స్వామి వారి దేవ‌స్థా‌నంలో ఈనెల 17నుంచి దేవీ శర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వా‌లను నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. 17న అమ్మ‌వారు ఆది‌లక్ష్మి అలం‌కా‌రంలో, 18న సంతాన లక్ష్మిగా, 19న గజ‌లక్ష్మి అలం‌కా‌రంలో, 20న ధన‌లక్ష్మిగా, 21న ధాన్య‌లక్ష్మిగా, 22న విజ‌య‌లక్ష్మిగా, 23న ఐశ్వర్య లక్ష్మిగా, 24న వీర‌లక్ష్మిగా, 25న మహా‌లక్ష్మిగా, 26న నిజ‌రూ‌పా‌లం‌కా‌రంలో దర్శ‌న‌మి‌వ్వ‌ను‌న్నారు.