ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 4,256 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,060 యాక్టివ్ కేసులు ఉండగా, 6,66,433 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 24గంటల్లో 7558 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. కొత్తగా 38 మంది మృత్యువాత పడగా.. మొత్తం 6019 మంది వైరస్ ప్రభావంతో మరణించారు. ఒకే రోజు 56,146 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం 61,50,351 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
