తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ -4 ఫలితాలను విడుదల చేసింది. 2018లో విడుదలైన గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో 1595 ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 30,723 నియామకాలను చేపట్టినట్లు కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు.
