విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించినందుకుగాను జిల్లాలోని తెలకపల్లి మండలం అనంతసాగర్ పంచాయతీ కార్యదర్శి లింగమయ్యను, తిమ్మాజీపేట మండలం రాళ్ల చెరువు తాండా పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ను కలెక్టర్ యాస్మిన్ భాష విధుల నుంచి సస్పెండ్ చేశారు.
