తెలంగాణలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. హోంశాఖ, అటవీ శాఖ మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, కార్యదర్శులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరుకానున్నారు.