మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని మూడో రోజు ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ప్రధానంగా బినామీ ఆస్తులపై నర్సింహారెడ్డిని విచారిస్తున్నారు. తన పదవిని అడ్డుపెట్టుకుని భూదందాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. పెద్ద అంబర్‌పేటలో ఓ హోటల్ బిజినెస్‌లో రూ. 50 లక్షల పెట్టుబడులపై కూడా ఆరా తీసుకున్నారు. హైటెక్‌సిటీలోని సర్వే నం. 64లోని 2 వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
