రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావును బుధవారం కేంద్ర ప్రభు త్వం నియమించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లలో సీనియర్‌గా ఉన్న ఈయన్ను ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ స్థానం లో తీసుకొచ్చారు. అనారోగ్య సమస్యల కారణంగా విశ్వనాథన్‌ ముందస్తుగానే తప్పుకున్నారు. దీంతో ఈడీ రాజేశ్వర్‌ రావును డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ క్యాబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఓ అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆర్బీఐకి మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారన్న విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు సంస్థాగతంగా, మరొకరు వాణిజ్య బ్యాంకుల నుంచి, ఇంకొకరు ఆర్థికవేత్తల నుంచి నియమితులవుతారు.