హైదరాబాద్‌లో జీఎంఎం గ్లాస్‌ లైన్డ్‌ ప్లాంట్‌

ఫార్మా,  రసాయన పరిశ్రమలకు యంత్రాలు సరఫరా చేసే జీఎంఎం ఫాడ్లర్‌.. హైదరాబాద్‌లో గ్లాస్‌ లైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆరంభించింది. మూడు నెలల క్రితం డీ డైడ్రిచ్‌ ప్రాసెస్‌ సిస్టమ్స్‌కు చెందిన యూనిట్‌ను రూ.53 కోట్లకు(6.25 మిలియన్‌ యూరోలు) కొనుగోలు చేసిన సంస్థ.. బుధవారం తిరిగి ఈ యూనిట్‌ను ఆరంభించింది. హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో 6 ఎకరాల స్థలంలో ఈ తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది.