తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతున్నది. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచే ఉండడంతో స్వామివారి దర్శనానంతరం ఆ ద్వారాల్లో ప్రవేశించేందుకు భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితోపాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, సినీ నటులు రాజేంద్రప్రసాద్, సునీల్, సప్తగిరి ప్రసాద్, కర్ణాటక మాండ్యా ఎంపీ సుమలత తదితరులు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.