తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 12 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,201కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కేసులు నమోదు అయ్యాయి. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి 211 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,644గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో నమోదవుతుంది. ఇప్పటివరకు 1,79,075 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులున్నట్లు బులెటిన్లో పేర్కొన్నారు.
