హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న భారీ వృక్షాన్ని నరికి వేయిస్తున్నాడు. దీన్ని సురభి మెట్పల్లి అనే వ్యక్తి చిత్రీకరించి.. ట్విట్టర్లో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. చెట్టు నరికివేతపై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్.. తక్షణమే మేయర్ బొంతు రామ్మోహన్‌ను అప్రమత్తం చేశారు. మేయర్ కూడా తక్షణమే స్పందించి.. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌కు ఎఫ్‌సీఐ కాలనీకి పంపి.. చెట్టు నరికి వేయించిన వ్యక్తికి రూ. 25 వేలు జరిమానా విధించారు.
చెట్లను నరికి వేయొద్దు : ఎంపీ సంతోష్ కుమార్
ఈ ఘటనపై తక్షణమే స్పందించి.. చెట్టు నరికి వేయించిన వ్యక్తికి జరిమానా విధించినందుకు మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఏ ఒక్కరూ కూడా చెట్లను నరికి వేయొద్దు అని, వాటిని కాపాడుకోవాలని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి మనం హాని కలిగిస్తే.. మన జేబుకే చిల్లు పడుతుందని ఎంపీ పేర్కొన్నారు.