కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు ఉంచిన గదిలో మంటలు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం వల్ల రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాజెక్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిసమాచారం తెలియాల్సి ఉన్నది.
