ఈ నెల 10, 11వ తేదీల్లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

ఈ నెల 10, 11వ తేదీల్లో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనుంది. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు సాహిత్యాభిమానుల వేదికగా జరిగే ఈ సదస్సును ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. ఈ రెండు రోజుల పాటు 32 గంటలు ఏకధాటిగా సదస్సు జరగనుంది. వీడియో జూమ్‌ ద్వారా జరిగే ఈ సదస్సును తెలుగు భాషను ప్రేమించే వారు ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా, ఏ సమయంలోనైనా వీక్షించొచ్చు.