తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కార్యాలయ భవన నిర్మాణ కోసం న్యూఢిల్లీలో స్థలం కేటాయించారు. ఢిల్లీ వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దీన్‌దయాల్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఢిల్లీలో స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.
