తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,10,346 కు చేరింది. కరోనా బారిన పడి మరో 9 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,217 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు.  గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 2,072 కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,83,025కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి.