ఏపీలో కొత్తగా 3,224 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కాస్త శాంతించింది. వారం రోజులుగా నిత్యం 5 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇవాళ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం ఏపీలో కొత్తగా 3,224 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 5,504 మంది కోలుకోగా 32 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తంగా 7,58,951 మంది కరోనా బారినపడగా 7,08,712 మంది చికిత్స కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

మరో 43,983 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.  తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇవాళ్టి వరకు 6,256 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 61,112 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇప్పటివరకు 66,30,728 టెస్టులు పూర్తి చేసినట్లు వెల్లడించింది.