ఈ నెల 21న దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్‌

దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు దేవదాయ శాఖ ఉత్త్తర్వులిచ్చింది. ఈనెల 17 నుంచి 25 వరకు ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.