తెలంగాణలో కొత్తగా మరో 1,708 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,708 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 2,009 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,792కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 1,233 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 24,208 కరోనా యాక్టివ్ కేసులుండగా… 1,89,351 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 19,748 మంది బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా హైదరాబాద్ లో 277, రంగారెడ్డిలో 137, మేడ్చల్ లో 124 కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.