తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలుకావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. బిల్లులకు ఇప్పటికే మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది.
సభలో ప్రవేశపెట్టిన బిల్లులు :
1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020
2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020
3. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020
4. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020