సీపీఐ నాయకుడు గుండా మ‌ల్లేశ్ మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల రాష్ర్ట‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్‌తో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈసంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్(75) అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఆయ‌న భౌతిక‌కాయాన్ని నారాయ‌ణ‌గూడ‌లోని మ‌క్దూమ్ భ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు. అనంత‌రం అక్క‌డినుంచి బెల్లంప‌ల్లికి త‌ర‌లిస్తారు. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గుండా మ‌ల్లేశ్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.