పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ భాగస్వాములయ్యారు. దేశ రాజధానిలోని సుందర్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో కపిల్ బుధవారం మొక్కలు నాటారు. ‘గ్రీన్ చాలెంజ్ వల్ల కాలుష్యం తగ్గి, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు నాట డం అందరి బాధ్యత. భారతీయులందరూ గ్రీన్ చాలెంజ్‌లో భాగస్వాములు కావాలి. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన బాధ్యతే’ అని కపిల్ దే వ్ అన్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగమైనందుకు కపిల్ దేవ్‌కు ఎంపీ సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.