హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దిల్సుఖ్నగర్ పరిధిలోని పలు కాలనీల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ, పీఎన్టీ కాలనీ, కమలానగర్ కాలనీలో రాత్రి 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దిల్సుఖ్నగర్, కొత్తపేట పరిధిలో వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్‌నగర్ రహదారిపై రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది.
