వరంగల్ జిల్లా లక్సేట్టిపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారం గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మందిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీ అయ్యారు. పట్టుబడ్డ వారి నుంచి రూ. 14,360లతో పాటు ఆరు సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో సిరికొండ రమేశ్, మామిండ్ల శంకర్, పార్వతి సతీష్, బత్తిని సత్తయ్య, జాడి శంకరయ్య ఉన్నారు. వీరిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తరలించారు. పరారైన వారిలో సందెల వెంకటేశ్, రాజబాబు, మురళీ ఉన్నారు. రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ టీ కిరణ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సీహెచ్ కిరణ్, లచ్చన్న, పోలీసులు వెంకటేశ్వర్లు, సంపత్ కుమార్, ఓంకార్, శ్రీనివాస్, సదానందం గౌడ్, భాస్కర్ గౌడ్, రాకేశ్.. పేకాట శిబిరంపై దాడి చేశారు.
