నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రెండు కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాలను ప్రాంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పన, కౌన్సిలర్లు ఖాజాఖాన్, టీఆర్‌ఎస్ నాయకులు భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
