తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడంపై సీఎం పళనిస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని పళనిస్వామికి కేసీఆర్ వివరించారు. నగదు, వస్తు రూపంలో సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుని తమ ఉదారత చాటుకున్నారని తమిళనాడు సీఎంను కేసీఆర్ అభినందించారు.
