సీఎంఆర్ఎఫ్‌కు జీహెచ్ఎంసీ ప్ర‌జాప్ర‌తినిధుల విరాళం

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వ‌చ్చారు. త‌మ 2 నెల‌ల జీతాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని ప్ర‌జాప్ర‌తినిధులు భరోసా ఇచ్చారు.  

వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.

‘మేఘా’ 10 కోట్ల విరాళం

సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు మేఘా ఇం జినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ స్పందించింది. సీఎం సహాయ నిధికి 10 కోట్ల విరాళం ప్రకటించింది. సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌, జనరల్‌ సెక్రటరీ మోహన్‌రెడ్డి ప్రకటించారు.