రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌తోపాటు పలువురు మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యంగా దేశంలో కరోనా స్థితి, కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, దేశ భద్రత, చైనాతో సరిహద్దుల్లో సైన్యం సన్నద్ధత తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది.
