వానాకాలం పంటల కొనుగోలుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

వానకాలం పంటల కొనుగోలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయాశాఖల ఉన్నతాధికారులు హాజర‌య్యారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు?.. ఎంత ధర వచ్చింది? తెలుపాలని, యాసంగిలో మక్కల సాగు లాభమా?..నష్టామా?.. ప్రస్తుత మార్కెట్‌పై మంత్రులు, అధికారులతో సీఎం చర్చిస్తున్నారు.