సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు అమితాబ్‌బచ్చన్ జన్మదిన శుభాకాంక్షలు

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు శనివారం బిగ్‌-బీ అమితాబ్‌బచ్చన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘వీసీ సజ్జనార్‌ నమస్కారం’ అంటూ ఓ వీడియోను విడుదలచేశారు. విధులు, సేవా కార్యక్రమాలు ఇదేవిధంగా కొనసాగించాలని కోరారు. భౌతికదూరం పాటించడంతోపాటు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని సజ్జనార్‌కు అమితాబ్‌ సూచించారు.