సమాచార పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు

సమాచార  పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు కల్పిస్తూ కమిషనర్ అర‌వింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న పది మంది డిస్టిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందారు. వీరితో పాటు ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లకు డివిజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు.