హరితహారంలో భాగస్వాములు కావాలి: డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎల్బీనగర్‌ డీసీపీ తన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఐదు మొక్కలను నాటారు. అనంతరం ఆయన శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్తలకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను విసిరారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భవిష్యత్తు తరాల మనుగడ కోసం సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హారితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎల్బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌ రావు, సీఐ అశోక్‌రెడ్డి, చైతన్యపురి సీఐ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు హరీశ్‌ ఉత్తమన్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు. అనంతరం నటుడు చరణ్‌, హాస్యనటులు సత్యం రాజేశ్‌, మధునందన్‌లకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విసిరారు.