ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఎస్సై లక్ష్మీనారాయణ

ఏసీబీ అధికారుల‌కు మ‌రో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయ‌లు డిమాండ్ చేసి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు. వివ‌రాల ప్ర‌కారం.. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న 2014 బ్యాచ్‌కు  చెందిన లక్ష్మీనారాయణ కేసు విషయంలో నిందితుడి నుంచి 50 వేల రూపాయ‌ల లంచం డిమాండ్ చేశారు. మొత్తానికి ఇద్దరి మ‌ధ్యా 30 వేల‌కు ఒప్పందం కుదిరింది. ఈ డ‌బ్బును ఎస్సైకి ఇస్తుండ‌గా ముందస్తు స‌మాచారం మేర‌కు పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన ఏసీబీ అధికానులు న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైతో పాటు ఈ ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్ హ‌స్తం కూడా ఉండ‌టంతో ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు.