నిజామాబా ద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణం చేయనున్నారు. శాసనసమండలి దర్బార్ హాల్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ఆమె చేత ప్రమాణం చేయిస్తారు. ఈ నెల 9న జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. కవిత 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటుచేసి బతుకమ్మ పండుగ, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు.
