పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకా న్ని బాధ్యతగా చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అమయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవా రం ఆయన అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి చేవెళ్ల మండలం ముడిమ్యాల, పల్గుట్ట, కందవాడ, తంగడిప ల్లి, ఆలూర్ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఆకస్మి కం గా పరిశీలించి ప్రజా ప్రతినిధులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వనాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టి రకరకాల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్‌లకు సూచించారు. అదే విధంగా ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రకృతి వనం చుట్టూ కందకం, మట్టి కట్టలు ఏర్పాటు చేసి మొక్కలకు ట్యాంకర్లతో నీటిని పోయాలని, తంగడిపల్లిలోని ప్రకృ తి వనం పక్కన ఉన్న గుట్టకు కాంటూరు వరుసల వారీ గా, వరుసకు ఒక రకం జాతి మొక్కలను నాటి అందం గా తీర్చిదిద్దాలన్నారు. ఆలూరు, తంగడిపల్లి గ్రామాల్లో ప్రకృతి వనం, రైతు వేదికలను పరిశీలించారు.
గ్రామానికి 10 వేల మొక్కలు నాటాలి
వచ్చే హరితహారం కార్యక్రమంలో ప్రతి గ్రామంలో 10 వేల మొక్కలు నాటే విధంగా లక్ష్యంగా పెట్టుకోవాలని కలెక్టర్ అమయ్‌కుమార్ ఈ సందర్భంగా సూచించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకొని హ రిత లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రజాప్రతినిధులు బా ధ్యతగా వ్యవహరించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల న్నారు. డీఎల్పీవో శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో హరీశ్ కు మార్, ఏపీవో నాన్సీ, కార్యదర్శులు, ముడిమ్యాల స ర్పంచ్ శేరి స్వర్ణలత, ఆలూర్ సర్పంచ్ కవ్వగూడెం విజయలక్ష్మి, ఆలూర్ ఉప సర్పంచ్ కసిరె వెంకటేశ్ యా దవ్, కందవాడ ఎంపీటీసీ రవీందర్, తంగడిపల్లి సర్పం చ్ తదితరులు పాల్గొన్నారు.