గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి కె నారాయణరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి కార్యక్రమంలో కె నారాయణరెడ్డి బాగంగా మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో కి నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు , మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడ అందరం చేయవలిసి వున్నది. ఇట్టి కార్యక్రమము లో బాగంగా ఈ ఏడాది లో పోలీసు డిపార్ట్మెంట్ నుడి హరితహారం లో ఎక్కువ మొక్కలు నాటే విదంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగ DE FORESTATION కారణముగా బ్రెజిల్ లో ని అమేఝాన్ ఫారెస్ట్, ఆస్ట్రైలియా లోని న్యూ సౌత్ వేల్స్ లో బుష్ ఫైర్ కారణముగా అడవులు నశించి పోవడం వల్ల జంతువులు కూడా చనిపోవడం జరుగుతుంది. మనం ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట అడవులను పెంచవలిసిన అవసరం చాలా వుంది. గాలి కాలుష్యం వల్ల మనకు భవిష్యత్ లో ఆక్సిజన్ దొరకడం కష్టంగ వుంటుంది. కావున దీనికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతిఒక్కరు ఈ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ అవి చెట్టుల ఎదిగేలా బాద్యత తీసుకోవాలని మీడియా ద్వారా తెలియచేస్తూ నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని అనుకరించడం జరిగింది. నేను ఇంకో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని అనుకరించేలా చేస్తాను. వాళ్ళు కూడా మూడు మొక్కలు నాటే విదంగా చూస్తానని తెలియచేస్తున్నాను.