శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. శాసనమండలి చాంబర్‌లో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రాజ్యాంగం, శాసనమండలి నిబంధనల పుస్తకాన్ని కవితకు అందజేశారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌ పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. కవితకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌గుప్తా, హన్మంతు షిండే, షకీల్‌ అహ్మద్‌, బీ సురేందర్‌, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌, ఎన్‌ భాస్కర్‌రావు, మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్‌, ఆకుల లలిత, రాజేశ్వర్‌రావు, ఎం శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, ఫారూఖ్‌ హుస్సేన్‌, పురాణం సతీశ్‌, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచార్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, జెడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, విఠల్‌రావు, కోవా లక్ష్మి, చావ వసంత, నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి తుల ఉమ, రాష్ట్ర కార్యదర్శి రూప్‌సింగ్‌, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌అచారి తదితరులు ఉన్నారు. ప్రమాణం చేసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మంత్రుల నివాస ప్రాంగణంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.