గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల
– ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన బృహత్తర కార్యక్రమం తెలంగాణకు హరితహారం
– కోట్ల మొక్కలను ప్రతి ఏటా నాటుతూ సంరంక్షించడం జరుగుతుంది
– మానవాళి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం హరితహారం
– కేసీఆర్ గారి హరితహారానికి కొనసాగింపు గ్రీన్ ఛాలెంజ్
– హరితహారాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం
– మానవసహిత అడవుల నిర్మాణానికి ఇది తోడ్పడుతుంది
– ఇది తెలంగాణ సమాజానికే కాదు మానవాళికి మేలు చేసే
– కొత్తతరం గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి ముందుకు తీసుకుపోవాలి
– ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ తో కలిసి మంత్రుల నివాస సముదాయంలోని తన క్వార్టర్ లో మూడు మొక్కలు నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల, రాష్ట్ర వణ్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ, కిశోర్ గౌడ్ తదితరులు
పర్యావరణ సమతుల్యతకు గ్రీన్ ఛాలెంజ్ అవసరం
– మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయం- ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నేను మొక్కలు నాటాను- మరో ముగ్గురు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసురుతున్నాను- న్యూజిలాండ్ లో ఎంపీ మైకేల్ వుడ్, భారత్ లోని స్నేహితులు కళ్యాణ్ కాసుగంటి, సునిత విజయ్ కోస్లాలను నామినేట్ చేసిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్.