లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్‌ పట్టణ సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్‌ గజేంద్రలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ భూవివాదంలో రూ.50 వేలు, ఓ బైకు, రూ.లక్షకు పైగా విలువల చేసే ఫోన్‌ను లంచంగా తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. సాజిద్‌ అనే వ్యక్తి నుంచి ఈ లంచాన్ని డిమాండ్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు..మాటు వేసి సీఐ పల్లె రాకేష్‌ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ గజేంద్ర ద్వారా సీఐ లంచం తెప్పించుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.