ఏపీలో కొత్తగా 2,618 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత వారంరోజులుగా 3 వేలలోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 2,618 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 3,509 మంది కోలుకోగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 16 మంది మృత్యువాతపడ్డారు. ఏపీలో ఇప్పటివరకు 8,25,966 మంది కరోనా బారిపడిన వీరిలో 7,95,592 మంది కోలుకున్నారు. మరో 23,668 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టివరకు 6,706 మంది చనిపోయారు. 24 గంటల వ్యవధిలో  రాష్ట్రంలో 88,780 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నేటివరకు 81,17,685 మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.