టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత రావుల శ్రీధ‌ర్ రెడ్డి

 టీఆర్ఎస్ పార్టీలో మ‌రో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో బీజేపీ నాయ‌కుడు రావుల శ్రీధ‌ర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ రెడ్డికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శ్రీధ‌ర్ రెడ్డితో పాటు వంద‌లాది మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, శ్రీనివాస్ గౌడ్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.