ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచివికాదని అభిప్రాయపడ్డారు. భౌతిక దాడులు సమంజసం కాదని, బీజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాల్సిన సమయంలో వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని.. ఎన్నికల్లో గెలుపోటములు ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. జర్నలిస్టుగా సమాజానికి సేవలందించి, ప్రజాధరణతో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
