యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి

చైనా బలగాలతో పోరాడి వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వు కాపీని సోమవారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు అందజేశారు. కర్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన తరువాత ఆ కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇందులో భాగంగా సంతోషికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు, హైదరాబాద్‌లో 711 గజాల స్థలం, రూ.5 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిన విషయం తెలిసిందే.