ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి సుజాత

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగిన సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఓటింగ్‌ను తీరుపై ఆమె ఆరా తీశారు. అలాగే దుబ్బాక మండలం బొప్పాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.