గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విసిరిన చాలెంజ్‌ను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత స్వీకరించారు. ఇందులో భాగంగా ఎస్పీ కార్యాలయంలో ఆమె మొక్కలు నాటి కామారెడ్డి కలెక్టర్ శరత్, సూర్యాపేట ఎస్పీ భాస్కరన్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ జితేష్ వి పాటిల్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు.