సంగారెడ్డి జిల్లా పరిధిలోని కంది తహసీల్దార్ ఆఫీస్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ లో వేగం పెరిగింది అని తెలిపారు. రిజిస్ర్టేషన్ కాగానే మ్యుటేషన్ జరిగిపోతుండటంతో చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.
