‘వెట‌ర్న‌రీ అసిస్టెంట్’ హాల్‌టికెట్లు విడుద‌ల

పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ఖాళీగా ఉన్న 22 ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను టీఎస్పీఎస్సీ విడుద‌ల చేసింది. రాతప‌రీక్ష కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. ప‌రీక్ష‌ల‌ను న‌వంబ‌ర్ 7, న‌వంబ‌ర్ 13 తేదీల్లో నిర్వ‌హించ‌నుంది. ఈ ప‌రీక్ష కంప్యూట‌ర్ ఆధారితంగా ఉంటుంది. ‌

ఈ నోటిఫికేష‌న్ ద్వారా వెట‌ర్న‌రీ అసిస్టెంట్ (13), ల్యాబ్ టెక్నీషియ‌న్ (9) పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. దీనికోసం జూలై 21న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టులో ముగిసింది. రాత ప‌రీక్ష‌లో ఎంపికైన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు.