తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015, 2016, 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. మణుగూరు అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా డా. షబరీష్, ఏటూరు నాగారం అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా గౌష్ ఆలం, రామగుండం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు(ఆపరేషన్స్)గా శరత్‌చంద్ర పవార్, భద్రాచలం అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా డా.వినీత్, ఆదిలాబాద్ అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఆపరేషన్స్)గా ఎం. రాజేష్‌చంద్ర నియమితులయ్యారు.
