తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలకు సీఎం కేసీఆర్ అందజేశారు. టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. ప్రచార వ్యూహం, టీఆర్ఎస్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార శైలిపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.