ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు ముగిసిన గడువు

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. నమోదుకు శుక్రవారం చివరిరోజు కావడంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు.  ఆన్‌లైన్‌, నేరుగా తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులను అందజేశారు. తాసిల్దార్‌ కార్యాలయాల ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరమే సంబంధిత ఓటరు నమో దు దరఖాస్తులకు ఆమోదం తెలుపుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి దరఖాస్తులకు సంబంధించి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డిసెంబర్‌ 1న ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేయనున్నారు. అదేవిధంగా డిసెంబర్‌ 31 వరకు ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 12, 2021 వరకు అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. జనవరి 18న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.